Pant: కేప్ టౌన్ టెస్టు: లంచ్ విరామానికి టీమిండియా ఆధిక్యం 143 పరుగులు

  • 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన భారత్
  • ఆదుకున్న పంత్, కోహ్లీ జోడీ
  • పంత్ అర్ధసెంచరీ
  • సంయమనంతో ఆడుతున్న కోహ్లీ
Pant and Kohli builds innings in Cape Town test

కేప్ టౌన్ టెస్టులో టీమిండియా మూడో రోజు తొలి సెషన్ లో కఠిన సవాళ్లను అధిగమించింది. ఓవర్ నైట్ స్కోరు 57/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ అదే స్కోరు వద్ద పుజారా (9) వికెట్ కోల్పోయింది. మరో పరుగు తేడాతో అజింక్యా రహానే (1) పెవిలియన్ బాట పట్టాడు. దాంతో భారత్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ జోడీ మొక్కవోని పట్టుదలతో ఇన్నింగ్స్ నిలబెట్టింది. వీళ్లిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించారు. దాంతో లంచ్ విరామానికి టీమిండియా 4 వికెట్లకు 130 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆధిక్యం 143 పరుగులకు చేరింది.

పంత్ దూకుడుగా ఆడుతూ 60 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 51 పరుగులు చేయగా, ఎంతో ఓపికగా ఆడిన కోహ్లీ 127 బంతుల్లో 28 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 2, జాన్సెన్ 2 వికెట్లు తీశారు.

More Telugu News