YSRCP: తిరుమల నుంచి అలిగి వెళ్లిపోయిన వైసీపీ ఎంపీ రెడ్డెప్ప

YSRCP MP Reddeppa went back from Tirumala
  • తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప
  • తనకు కేటాయించిన అతిథిగృహంలో వసతులు బాగోలేవని మండిపాటు
  • మరో గది కేటాయిస్తామని చెప్పినా అలిగి వెళ్లిపోయిన ఎంపీ
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులతో కిక్కిరిసి పోయింది. వైకుంఠ ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు కొండపైకి వచ్చారు. వీవీఐపీలు, వీఐపీలు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు. మరోవైపు వైసీపీ చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప అలిగి వెళ్లిపోయారు.

వివరాల్లోకి వెళ్తే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వకుళమాత, నందకం అతిథిగృహాలను కేటాయించారు. దీంతో వకుళమాత అతిథిగృహానికి చేరుకున్న రెడ్డెప్ప... తనకు కేటాయించిన గదిలో సరైన సౌకర్యాలు లేవని అక్కడి రిసెప్షన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెడ్స్, బెడ్ షీట్లు సరిగా లేవని మండిపడ్డారు. వేరే గదిని కేటాయిస్తామని అధికారులు చెప్పినప్పటికీ ఆయన శాంతించలేదు. అలిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు పలువురు ఇతర ఎమ్మెల్యేలు కూడా గదుల కేటాయింపుపై అసహనం వ్యక్తం చేశారు.
YSRCP
MP
Reddeppa
Tirumala

More Telugu News