Samsung: శామ్ సంగ్ నుంచి రూ.18 వేలకే పవర్ ఫుల్ ట్యాబ్

  • భారత మార్కెట్లో విడుదల
  • వైఫై, ఎల్టీఈ సపోర్టెడ్ వెర్షన్లు
  • పెద్ద డిస్ ప్లే, అధిక బ్యాటరీ సామర్థ్యం
  • స్క్రీన్ రికార్డింగ్ ఫీచర్
  • రూ.2,000 క్యాష్ బ్యాక్ ఆఫర్
Samsung Galaxy Tab A8 launched

శామ్ సంగ్ కంపెనీ గెలాక్సీ ట్యాబ్ ఏ8 ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కొత్త డిజైన్ తో, పెద్ద స్క్రీన్ తో, అధిక బ్యాటరీ సామర్థ్యంతో, చక్కని ఆడియో అనుభవాన్ని ఇది ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.

శామ్ సంగ్ ట్యాబ్ ఏ8 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ రకం ధర రూ.17,999. ఇందులో సిమ్ ట్రే సదుపాయం ఉండదు. వైఫై ఎనేబుల్డ్. ఇందులోనే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.19,999.

ఇక ఎల్టీఈ సిమ్ ను సపోర్ట్ చేసే ట్యాబ్ ఏ8 3జీబీ, 32జీబీ స్టోరేజీ ధర రూ.21.999. ఇందులోనే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.23,999.

ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే రూ.2,000 క్యాష్  బ్యాక్ ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. బుక్ కవర్ ను రూ.999కే పొందొచ్చని పేర్కొంది.

10.5 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే, స్లిమ్ బెజెల్స్ 16:10 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. డాల్బీ ఆటమ్స్ క్వాడ్ స్పీకర్ ఉంటుంది. 7,040 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాలు ఉంటాయి.

ఇందులో యూనిసాక్ టైగర్ టీ618 ప్రాసెసర్ ఉంటుంది. స్క్రీన్ రికార్డర్ సదుపాయం కూడా ఉంది. ఏదైనా నచ్చిన కార్యక్రమాన్ని రికార్డు చేసుకోవచ్చు. ఆన్ లైన్ క్లాస్ లకు ఇది అనుకూలం.

  • Loading...

More Telugu News