సీఎం జ‌గ‌న్‌తో భేటీ కోసం బేగంపేట విమానాశ్రయం నుంచి బ‌య‌ల్దేరిన చిరంజీవి

13-01-2022 Thu 12:11
  • జ‌గ‌న్‌తో చిరంజీవి లంచ్ మీటింగ్  
  • సినిమా టికెట్ల ధ‌ర‌ల‌పై చ‌ర్చ‌
  • అనంత‌ర‌మే మీడియాతో మాట్లాడ‌తాన‌న్న చిరు
chiranjeevi to meet jagan
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి ఈరోజు మధ్యాహ్నం కలవనున్న విష‌యం తెలిసిందే. ఇద్దరూ కలిసి మధ్యాహ్నం లంచ్ కూడా చేయనున్నట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌ను క‌లిసేందుకు హైద‌రాబాద్‌లోని బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి విజయవాడ బయలుదేరారు. సీఎంతో భేటీ తర్వాతే తాను ఈ విష‌యంపై మాట్లాడుతాన‌ని ఈ సంద‌ర్భంగా చిరంజీవి చెప్పారు.

కాగా, ఏపీలో సినిమా టికెట్లు, థియేట‌ర్ల‌ వివాదాల‌ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఏపీ స‌ర్కారుతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు చర్చించారు. థియేట‌ర్ల విష‌యంలో వాటి య‌జ‌మానుల‌కు కాస్త ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ప్ప‌టికీ సినిమా టికెట్ల విష‌యంలో నిర్మాత‌ల‌కు ఊర‌ట ద‌క్క‌లేదు. దీంతో ఈ అంశంపైనే జ‌గ‌న్‌తో చిరంజీవి చ‌ర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ భేటీ అనంత‌రం చిరంజీవి మీడియాతో మాట్లాడ‌తారు.