Raviteja: సీసా సాంగ్ చిత్రీకరణలో 'రామారావు ఆన్ డ్యూటీ'

  • రిలీజ్ కి రెడీగా ఉన్న 'ఖిలాడి'
  • ముగింపు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
  • సెట్స్ పైనే ఉన్న 'ధమాకా'
  • ఈ నెల 14న 'రావణాసుర'కి క్లాప్  
Ramarao On Duty movie update

రవితేజ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఖిలాడి' రెడీ అవుతోంది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు. మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి నాయికలుగా సందడి చేయనున్నారు. ఆ తరువాత సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ' రూపొందుతోంది.

శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా దివ్యాన్ష కౌశిక్ అలరించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సీసా సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్న ఈ పాట ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇక ఆ తరువాత రవితేజ .. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'ధమాకా' చేస్తున్నాడు. శ్రీలీల కథానాయికగా ఆల్రెడీ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇక ఆ తరువాత ప్రాజెక్టుగా 'రావణాసుర' సినిమా ఈ నెల 14వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ సినిమాతో పాటు 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ ను కూడా రవితేజ లైన్లో పెట్టేశాడు.

More Telugu News