కొత్త వ్యాపారాన్ని ప్రారంభించబోతున్న అల్లు అర్జున్!

12-01-2022 Wed 15:50
  • దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెడుతున్న బన్నీ
  • 'ఏఏ' బ్రాండ్ పేరుతో బ్రాండెడ్ దుస్తుల వ్యాపారం
  • థియేటర్ బిజినెస్ లోకి కూడా ఎంటరవుతున్న అల్లు అర్జున్
Allu Arjun entering into new business
సినీ హీరో అల్లు అర్జున్ కి స్టైలిష్ స్టార్ గా గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. కేరళలో కూడా బన్నీకి చాలా ఫాలోయింగ్ ఉంది. ఆయనను వారు ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటుంటారు. తాజాగా 'పుష్ప' సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. హిందీ ప్రేక్షకులను కూడా 'పుష్ప' ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం హిందీ వర్షన్ ఇప్పటికే రూ. 75 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

మరోవైపు వరుస సినిమా విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్... మరో కొత్త వ్యాపారంలో అడుగుపెట్టబోతున్నాడు. దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నాడు. ఇప్పటికే తన బ్రాండ్ ను 'ఏఏ' రూపంలో ప్రమోట్ చేస్తున్న బన్నీ... ఇప్పుడు అదే బ్రాండ్ నేమ్ తో దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నాడు. వాస్తవానికి ఈ బ్రాండ్ ఇప్పటికే మార్కెట్లోకి రావాల్సి ఉంది... అయితే కరోనా నేపథ్యంలో ఆలస్యమయింది.

మరోవైపు థియేటర్ బిజినెస్ లోకి కి కూడా బన్నీ ఎంటరవుతున్నాడు. హైదరాబాద్ అమీర్ పేటలో ఉన్న సత్యం థియేటర్ స్థానంలో ఏషియన్ సినిమాస్ తో కలిపి మల్టీప్లెక్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాడు.