Raghu Rama Krishna Raju: నా అభిమాన సినీ హీరో ఈయనే: రఘురామకృష్ణరాజు

My favorite hero is pawan kalyan says Raghu Rama Krishna Raju
  • నేను పవన్ కల్యాణ్ అభిమానిని
  • ఎక్కడ నెగ్గాలో మాత్రమే కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా నాకు తెలుసు
  • సీఐడీ అధికారి సునీల్ ఒక ఉన్మాది
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానినని ఆయన తెలిపారు. 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో కూడా తెలిసిన వాడినని' ఆయన పవన్ సినిమాలోని డైలాగ్ చెప్పారు.

ఈ రోజు హైదరాబాదులోని రఘురాజు నివాసానికి ఏపీ సీఐడీ అధికారులు వచ్చారు. ఈ నెల 17వ తేదీన తమ విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తాను ఆ రోజున విచారణకు హాజరవుతానని సీఐడీ అధికారులకు ఆయన తెలిపారు. ఇదే సమయంలో ఏపీ సీఐడీ చీఫ్ సునీల్ పై ఆయన మండిపడ్డారు. 'సునీల్ ఒక ఉన్మాది' అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

గతంలో తనను అరెస్ట్ చేసే సమయంలో సీసీటీవీ కెమెరాలు కూడా లేకుండా చేశారని రఘురాజు మండిపడ్డారు. తనపై, తన వ్యక్తిగత సిబ్బందిపై దాడి చేశారని అన్నారు. దీనికి సంబంధించిన వివరాలను సుప్రీంకోర్టుకు కూడా సమర్పించానని తెలిపారు.

ఇదిలావుంచితే, ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేసి గెలుస్తానని ఇటీవలే రఘురాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతికి భీమవరంకు వెళ్తానని, అక్కడ రెండు రోజులు ఉంటానని కూడా ఆయన తెలిపారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ఏపీకి వెళ్తారా? లేదా? అనే విషయంలో సందేహాలు నెలకొన్నాయి.
Raghu Rama Krishna Raju
YSRCP
Pawan Kalyan
Janasena
AP CID

More Telugu News