ట్రైలర్ తోనే సందడి మొదలెట్టిన 'బంగార్రాజు'

12-01-2022 Wed 10:20
  • ఈ నెల 14న రానున్న 'బంగార్రాజు'
  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ 
  • ఫాంటసీ టచ్ తో పెరుగుతున్న ఆసక్తి 
  • హిట్ ఖాయమంటూ వినిపిస్తున్న టాక్    
Bangarraju Movie Update
నాగార్జున కథానాయకుడిగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' సినిమా రూపొందింది. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా నుంచి ఇంత వరకూ వదిలిన అప్ డేట్స్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా వదిలిన ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.

చాలా తక్కువ సమయంలో ఈ ట్రైలర్ 7 మిలియన్ కి పైగా వ్యూస్ ను దక్కించుకుంది. చకచకా డిజిట్స్ ను మార్చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది. గ్రామీణ నేపథ్యంలోని కథకావడం .. నాగ్ - రమ్యకృష్ణ జోడీ, చైతూ - కృతిశెట్టి జోడీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడం.. యాక్షన్ కీ .. రొమాన్స్ కి కాస్త ఫాంటసీని జోడించడం అందరిలో ఆత్రుతను పెంచుతున్నాయి.

సంక్రాంతి పండుగ నేపథ్యానికి తగిన కథ కావడంతో, ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. అందువలన అందరూ కూడా ఈ నెల 14వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. గతంలో సంక్రాంతికి వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' మాదిరిగా, ఈ సినిమా కూడా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.