బుల్లితెరపై సందడి చేస్తున్న సీనియర్ నటి రాధ
- దక్షిణాది భాషల్లో అలరించిన రాధ
- పెళ్లి తర్వాత ముంబయిలో నివాసం
- అడపాదడపా ఈవెంట్లలో దర్శనం
- త్వరలో జీ తమిళ్ లో సూపర్ క్వీన్ రియాల్టీ షో
- న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రాధ
తాజాగా ఓ టీవీ చానల్లో జడ్జిగా సందడి చేస్తోంది. 'జీ తమిళ్' చానల్లో ఈ నెల 16న ప్రారంభం కానున్న 'సూపర్ క్వీన్' కార్యక్రమానికి రాధ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తోంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.
చాలాకాలం తర్వాత ఓ రియాల్టీ షో ద్వారా మళ్లీ వస్తున్నానని రాధ ట్వీట్ చేసింది. తన సహ న్యాయనిర్ణేతగా నకుల్ వ్యవహరిస్తున్నాడని, ఈ కార్యక్రమం 'జీ తమిళ్' లో ప్రసారం అవుతుండడం సంతోషదాయకం అని పేర్కొంది. ఈ షోలో ప్రతి నిమిషాన్ని ఆస్వాదిస్తున్నానని ఈ అందాలనటి పేర్కొంది. ఎంతోమంది అమ్మాయిల ప్రతిభను ఈ కార్యక్రమంలో వీక్షించడం పట్ల గర్వంగా ఉందని తెలిపారు. అంతేకాదు, 'సూపర్ క్వీన్' ప్రోమో కూడా పంచుకున్నారు.