Kiren Rijiju: సైనాపై వ్యాఖ్యలు అతడి సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం: సిద్ధార్థ్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్రమంత్రి

Union Minister Kiren Rijiju condemns Siddharth comments on Saina Nehwal
  • మోదీ కాన్వాయ్ ని అడ్డుకున్న నిరసనకారులు
  • ఖండించిన బ్యాడ్మింటన్ స్టార్  సైనా నెహ్వాల్
  • సైనాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సిద్ధార్థ్
  • దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు.. విమర్శలు 
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై సినీ నటుడు సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఖండించారు. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం కలిగిన సైనాపై ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేయడం అతడి సంకుచిత ధోరణికి నిదర్శనం అని విమర్శించారు.

"భారత్ ను క్రీడా శక్తిగా మలచడంలో సైనా అద్భుత భాగస్వామ్యం పట్ల దేశం గర్విస్తోంది. సైనా ఒలింపిక్ పతక విజేత మాత్రమే కాదు, నికార్సయిన దేశభక్తురాలు కూడా" అని కిరణ్ రిజిజు ట్విట్టర్ లో స్పందించారు.

పంజాబ్ లో ప్రధాని మోదీకి చేదు అనుభవం ఎదురుకావడం పట్ల సైనా ఖండిస్తూ ఓ ప్రకటన చేయగా, దానిపై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జాతీయ మహిళా కమిషన్ కూడా సిద్ధార్థ్ పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది.
Kiren Rijiju
Saina Nehwal
Siddharth
Narendra Modi

More Telugu News