కథానాయిక కీర్తి సురేశ్ కు కరోనా పాజిటివ్!

11-01-2022 Tue 17:23
  • తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయన్న కీర్తి సురేశ్
  • అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా బారిన పడ్డానని వ్యాఖ్య
  • ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నానని వెల్లడి
Keerthy Suresh tests positive for Corona
సినీ పరిశ్రమను కరోనా మహమ్మారి వణికిస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. తాజాగా అందాల భామ కీర్తి సురేశ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాను కరోనా బారిన పడ్డానని... కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పింది.

అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా తాను కరోనా బారిన పడ్డానని తెలిపింది. మహమ్మారి వ్యాపిస్తున్న తీరు ఆందోళనను కలగజేస్తోందని చెప్పింది. ప్రస్తుతం తాను ఐసొలేషన్ లో ఉన్నానని తెలిపింది. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని సూచించింది. అందరూ కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలిపింది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలని చెప్పింది. త్వరలోనే కరోనా నుంచి కోలుకుని మళ్లీ యాక్షన్ లోకి వస్తానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.