Raviteja: 'రావణాసుర' నుంచి యంగ్ హీరో లుక్!

  • 'రావణాసుర'గా రవితేజ
  • ముఖ్యమైన పాత్రలో సుశాంత్
  • దర్శకుడిగా సుధీర్ వర్మ
  • త్వరలో సెట్స్ పైకి        
Sushanth in Ravanasura Movie

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో సుశాంత్ ఒకరు. హీరోగా కొన్ని సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు. దాంతో ఆయన స్టార్ హీరోల సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేయడానికి రెడీ అయ్యాడు. ఆ మధ్య 'అలవైకుంఠపురములో' సినిమాలో ఆయన చేసిన పాత్ర మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది.

తాజాగా ఆయన రవితేజ 'రావణాసుర' సినిమాలోను ఒక కీలకమైన పాత్రను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన రామ్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, ఆయన పాత్రకి సంబంధించిన లుక్ ను వదిలారు. ఈ పోస్టర్ లో సుశాంత్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు.

అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రవితేజ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంతకుముందు ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో 'స్వామిరారా' హిట్ చిత్రాల జాబితాలో చేరిపోగా, 'దోచేయ్' ఫరవాలేదు అనిపించుకుంది.

  • Loading...

More Telugu News