వేల్స్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న తమిళ సినీ హీరో శింబు

11-01-2022 Tue 16:31
  • వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలిపిన శింబు
  • ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, అమ్మానాన్నలకు అంకితమిస్తున్నానని వ్యాఖ్య
  • కార్యక్రమానికి హాజరైన శింబు తల్లిదండ్రులు
Vels university gives honorary doctorate to Simbu
తమిళ సినీ హీరో శింబుకు విలక్షణమైన నటుడిగా గుర్తింపు ఉంది. బాల నటుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన శింబు మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. తమిళనాట శింబుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరోవైపు ఆయనను తమిళనాడులోని వేల్స్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. ఈ విషయాన్ని శింబు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు. ఈ గౌరవాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్టు శింబు పేర్కొన్నాడు.
 
తనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చిన వేల్స్ యూనివర్శిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పాడు. ఈ గౌరవాన్ని తమిళ సినిమాకు, అమ్మానాన్నలకు అంకితమిస్తున్నానని తెలిపాడు. తన జీవితంలో సినిమా ఉండటానికి వారే కారణమని చెప్పాడు. తన అభిమానులకు కూడా ధన్యవాదాలు తెలిపాడు. మరోవైపు ఈ కార్యక్రమానికి శింబు తల్లిదండ్రులు టి.రాజేందర్, ఉష కూడా హాజరయ్యారు.