Mayawati: మాయావతి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయరు: బీఎస్పీ

Mayawati not contesting in UP assembly elections
  • తాను కూడా పోటీ చేయడం లేదన్న బీఎస్పీ ఎంపీ సతీశ్ చంద్ర
  • ఫిబ్రవరి 10 నుంచి అసెంబ్లీ ఎన్నికలు
  • మార్చి 10న కౌంటింగ్
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎంపీ సతీశ్ చంద్ర మిశ్రా వెల్లడించారు. తాను కూడా ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. సమాజ్ వాదీ పార్టీకి 400 మంది అభ్యర్థులు లేనప్పుడు... 400 స్థానాల్లో వాళ్లు ఎలా పోటీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. యూపీలో బీజేపీ కానీ, సమాజ్ వాదీ పార్టీ కానీ అధికారంలోకి రాలేదని... బీఎస్పీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు.

ఇక, 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ శాసనసభ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి జరగనున్నాయి. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3 , 7 తేదీలలో ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. మార్చి 10న కౌంటింగ్ జరుగుతుంది. మరోవైపు, మాయావతి ఇంత వరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని విషయం గమనార్హం.
Mayawati
BSP
Uttar Pradesh
Assembly Elections

More Telugu News