AP High Court: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం!

AP high court orders all courts to hear virtually
  • ఈ నెల 17 నుంచి వర్చువల్ విధానం ద్వారానే కేసుల విచారణ
  • అన్ని కోర్టులకు ఆదేశాలను జారీ చేసిన హైకోర్టు
  • కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఏపీలో సైతం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేసులను వర్చువల్ విధానంలోనే విచారించబోతున్నట్టు స్పష్టం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. సంక్రాంతి సెలవుల తర్వాత ఈ నెల 17 నుంచి వర్చువల్ విధానంలోనే కేసుల విచారణను చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో అన్ని కోర్టుల్లో విచారణ ప్రత్యక్షంగా కాకుండా, వర్చువల్ గా జరగనుంది.
AP High Court
Proceedings
Virtual

More Telugu News