లతా మంగేష్కర్ కు క‌రోనా.. ఐసీయూలో చికిత్స‌

11-01-2022 Tue 13:47
  • ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుప‌త్రిలో ల‌తా మంగేష్క‌ర్
  • స్వల్ప లక్షణాలున్నాయన్న బంధువులు
  • వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే చికిత్స‌
Lata Mangeshkar admitted to ICU after testing positive for Covid19
ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్‌ (92)కు క‌రోనా సోకడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుప‌త్రిలో చేర్చారు. ప్ర‌స్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారని లతా మంగేష్కర్ క‌జిన్ రచన మీడియాకు తెలిపారు. ల‌తా మంగేష్క‌ర్‌కు స్వల్ప లక్షణాలున్నాయని, కానీ వయసు రీత్యా ముందు జాగ్రత్త కోసం మాత్రమే ఐసీయూలో ఉంచార‌ని ఆమె తెలిపారు.

దయచేసి త‌మ‌ గోప్యతను గౌరవించాల‌ని, త‌మ అక్క గురించి ప్రార్థించాల‌ని రచన కోరారు. కాగా 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్‌ ఆసుపత్రిలో చేరి, కోలుకున్న విష‌యం తెలిసిందే.