Somu Veerraju: పాక్‌, ఆఫ్ఘన్‌ దేశాలలో లాగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు: సోము వీర్రాజు

  • చివర‌కు పొరబాటు జరిగింది క్షమించమని ప్ర‌భుత్వం వేడుకుంది
  • మైనారిటీల ఓట్ల కోసం కుట్ర‌
  • రాష్ట్ర వ్యాప్తంగా హిందువులను ద్రోహులుగా చిత్రీకరిస్తున్న ప్ర‌భుత్వం
  • ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ బీజేపీ విశ్రమించదు
somu veerraju slams  ycp

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో శాంతి, భ‌ద్ర‌త‌లు దెబ్బ‌తింటున్నాయ‌ని ఆరోపించారు. 'ఆత్మకూరు ఘటనలో గాయపడి కడప జిల్లా కారాగారంలో ఉన్న నంద్యాల పార్లమెంటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీ బుడ్డా శ్రీకాంత్ రెడ్డి గారి నివాసానికి వెళ్లి వారి అమ్మగారికి, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని చెప్పడం జరిగింది' అని సోము వీర్రాజు చెప్పారు.

'కేవలం మైనారిటీల ఓట్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా హిందువులను ద్రోహులుగా చిత్రీకరిస్తున్న సీఎం జ‌గ‌న్ గారి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ బీజేపీ ఏపీ విశ్రమించదు. మా నాయకుల వాహనాన్ని దగ్ధంచేసి, పోలీసు స్టేషన్ ను ధ్వంసంచేసి దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలలో లాగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టిస్తే, ఈ వైసీపీ ప్రభుత్వం పొరబాటు జరిగింది క్షమించమని వేడుకోవటానికి సిగ్గులేదా? అని ప్రశ్నిస్తున్నాను. ఈ సంఘటనను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని క్షుణ్ణంగా తెలియజేసి, డీజీపీ,హోం మంత్రి, ముఖ్యమంత్రి గారి నిర్లక్ష్య ధోరణిని ఎండగడతామని స్పష్టం చేస్తున్నాను' అని సోము వీర్రాజు చెప్పారు.

  • Loading...

More Telugu News