కరోనా నుంచి కోలుకున్న సత్యరాజ్.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోనున్న కట్టప్ప!

11-01-2022 Tue 11:48
  • కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురైన సత్యరాజ్
  • ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపిన ఆయన కుమారుడు
  • ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని వెల్లడి
Sathyaraj recovered from Corona
ప్రముఖ సినీ నటుడు సత్యరాజ్ కరోనా నుంచి కోలుకున్నారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన ఆయన... చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు.

ఈ  నేపథ్యంలో అభిమానులకు ఆయన కుమారుడు గుడ్ న్యూస్ చెప్పారు. తన తండ్రి కరోనా నుంచి కోలుకున్నారని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన తండ్రి క్షేమంగా ఉన్నారని, నిన్న రాత్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. కొన్ని రోజుల పాటు ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటారని... ఆ తర్వాత షూటింగుల్లో పాల్గొంటారని తెలిపారు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు.