Allu arjun: బన్నీ పూర్తిగా 'పుష్ప'లా మారిపోయాడు: కార్తి

karthi Comments on Pushpa movie
  • క్రితం నెల 17న వచ్చిన 'పుష్ప'
  • అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్
  • అభినందనలు తెలియజేసిన బాలీవుడ్ స్టార్స్
  • ప్రశంసలు కురిపించిన కార్తి

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన 'పుష్ప' క్రితం నెల 17వ తేదీన వివిధ భాషల్లో విడుదలైంది. తొలిరోజునే కాస్త నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ తట్టుకుని నిలబడింది. సక్సెస్ పార్టీల పేరుతో బన్నీ జనంలోకి వెళ్లడంతో ఈ సినిమా వసూళ్లు అదే రేంజ్ లో కొనసాగుతూ వెళ్లాయి. బన్నీ నటనకి నూటికి నూరు మార్కులు పడిపోయాయి.

తమిళ .. మలయాళ .. హిందీ భాషల నుంచి కూడా ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ హీరోలు సైతం బన్నీ నటనను మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు. అలాగే ఈ సినిమా తమిళ వెర్షన్ చూసిన కార్తి కూడా తనదైన స్టయిల్లో స్పందించాడు.

''బన్నీ పూర్తిగా 'పుష్ప'గా మారిపోయాడు. ఆ పాత్రలోకి ఆయన పూర్తిగా ప్రవేశించాడు. నిజంగా బన్నీ అరెస్టింగ్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశాడు. ఇక సాయికుమార్ గారి విషయానికి వస్తే, ఆయన ప్రెజెంటేషన్ ఒక రేంజ్ లో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా చేశారు. తమకి అప్పగించిన పనికి న్యాయం చేశారు" అంటూ రాసుకొచ్చాడు. దాంతో ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ బన్నీ రిప్లై ఇచ్చాడు.

  • Loading...

More Telugu News