Chiranjeevi: మెగాస్టార్ సరసన అనుష్క?

Anushka in Chiranjeevi Movie
  • సినిమాలు తగ్గించిన అనుష్క
  • అభిమానుల్లో తగ్గని క్రేజ్
  • వెంకీ కుడుములకి ఛాన్స్ ఇచ్చిన చిరూ
  • అనుష్కను ఒప్పించే పనిలో దర్శకుడు  
తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో అనుష్క నాయిక ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. ముఖ్యంగా సినిమాలను చాలావరకూ తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె యూవీ బ్యానర్లో ఒక సినిమా చేయనుందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.

ఇక ఇప్పుడు మరో సినిమా కోసం అనుష్కను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అదీ మెగాస్టార్ చిరంజీవి సరసన కావడం వలన ఆమె ఒప్పుకోవచ్చని అంటున్నారు. చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' .. 'భోళా శంకర్' .. 'వాల్తేర్ వీర్రాజు' సినిమాలు పట్టాలెక్కాయి.

ఈ సినిమాల్లో నయనతార .. తమన్నా .. శ్రుతిహాసన్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఆ తరువాత ప్రాజెక్టుగా చిరంజీవి .. వెంకీ కుడుముల సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసమే అనుష్కను అడుగుతున్నారట. ఇదిలావుంచితే, 'ఛలో' .. 'భీష్మ' వంటి హిట్స్ ఇచ్చిన వెంకీ కుడుముల వినిపించిన కథ మెగాస్టార్ కి ఒక రేంజ్ లో నచ్చిందని మాత్రం చెప్పుకుంటున్నారు.
Chiranjeevi
Nayanathara
Sruthi Haasan
Anushka

More Telugu News