ఏపీ, తెలంగాణలో మూడు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ సోదాలు.. రూ. 800 కోట్ల నల్లధనం లావాదేవీల గుర్తింపు
- ఈ నెల 5 నుంచి నాలుగు రోజులపాటు తనిఖీలు
- రూ. 1.64 కోట్ల నగదు పట్టివేత
- నవ్య డెవలపర్స్, రాగమయూరి ఇన్‌ఫ్రా, స్కంధాని ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు?
సోదాలు నిర్వహించిన మూడు రియల్ ఎస్టేట్ కంపెనీలు కర్నూలు, విశాఖపట్టణం, అనంతపురం, నంద్యాల, బళ్లారి నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అనంతపురం, కర్నూలు, కడప, నంద్యాలతోపాటు వివిధ పట్టణాల్లో ఈ కంపెనీలకు చెందిన 24 కార్యాలయాల్లో ఈ నెల 5 నుంచి నాలుగు రోజులపాటు తనిఖీలు నిర్వహించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. కాగా, నవ్య డెవలపర్స్, రాగమయూరి ఇన్‌ఫ్రా, స్కంధానీ ఇన్‌ఫ్రా కంపెనీల్లో సోదాలు జరిగినట్టు తెలుస్తోంది.