Narendra Modi: రాహుల్ రహస్య పర్యటనల సమయంలోనే దేశంలో అల్లర్లు.. మర్మమేంటో?: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

PM Modis security lapse BJPs Gupt vacation barb at Rahul Gandhi Sambit Patra shared a graphic
  • రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై సంచలన వ్యాఖ్యలు
  • గ్రాఫిక్స్ షేర్ చేసిన సంబిత్ పాత్రా
  • ‘గుప్త ప్రయోగం’ చేస్తున్నారని ఆరోపణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రాహుల్ గాంధీ అజ్ఞాత పర్యటనలు చేసిన ప్రతిసారి దేశంలో ఏదో ఒక ఘటన చోటుచేసుకుంటోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని ఆయన ‘గుప్త ప్రయోగం’ (రహస్య ప్రయోగం)గా అభివర్ణించారు.

గత మూడేళ్లగా రాహుల్ విదేశాలకు రహస్యంగా వెళ్లి వస్తున్నారని, ఆ సమయంలోనే దేశంలో వివిధ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ట్వీట్ చేస్తూ ఇందుకు సంబంధించిన గ్రాఫిక్స్‌ను షేర్ చేశారు. ఇందులో ఢిల్లీ అల్లర్లు, ఎర్రకోట హింసాకాండ, ప్రధానమంత్రి భద్రతా లోపం వంటివి ఉన్నాయి. ఈ ఘటనలన్నీ రాహుల్ దేశంలో లేనప్పుడే జరిగాయని అన్నారు. 2020లో రాహుల్ రహస్య విదేశీ పర్యటన సందర్భంగా ఢిల్లీ అల్లర్లు, 2021 పర్యటన సమయంలో ఎర్రకోట అల్లర్లు, ఇప్పుడు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం వంటివి జరిగాయని అన్నారు.
Narendra Modi
BJP
Rahul Gandhi
Sambit Patra

More Telugu News