బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా

10-01-2022 Mon 22:22
  • దేశంలో తీవ్రస్థాయిలో కరోనా వ్యాప్తి
  • స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న నడ్డా
  • కరోనా పరీక్షల్లో పాజిటివ్
  • ఐసోలేషన్ లో ఉన్నానని నడ్డా వెల్లడి
BJP President JP Nadda tested corona positive
కరోనా రక్కసి కోరలు చాచి విజృంభిస్తోంది. దేశంలో వెల్లువలా కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. రాజకీయ నేతలు సైతం పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా సోకింది. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని నడ్డా వెల్లడించారు.

గత కొన్నిరోజులుగా తనను కలిసినవాళ్లు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. డాక్టర్ల సలహా మేరకు తాను ఐసోలేషన్ లో ఉన్నానని, ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు.