Andhra Organics Limeted: ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీకి రూ.1 కోటి విరాళం అందజేసిన ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్

Andhra Organics Limited donates One Crore rupees to AP Govt
  • ఏపీలో ఇటీవల వరదలు
  • రాష్ట్రంపై కరోనా ప్రభావం
  • భారీ విరాళంతో ముందుకొచ్చిన విర్కోస్ గ్రూప్
  • సీఎం జగన్ ను కలిసిన విర్కోస్ గ్రూప్ డైరెక్టర్ మహావిష్ణు
 ఇటీవల ఏపీలో పలు జిల్లాల్లో వరదలు సంభవించి తీవ్ర నష్టం వాటిల్లడం తెలిసిందే. మరోవైపు కరోనా సంక్షోభం కూడా రాష్ట్రంపై భారీగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీకి ఆంధ్రా ఆర్గానిక్స్ లిమిటెడ్ భారీ విరాళాన్ని ఇచ్చింది. ఈ కంపెనీ మాతృసంస్థ విర్కోస్ గ్రూప్ డైరెక్టర్ ఎం.మహావిష్ణు రెడ్డి నేడు సీఎం జగన్ ను కలిసి, రూ.1 కోటి విరాళం తాలూకు చెక్ ను ఆయనకు అందజేశారు.

ప్రజాసంక్షేమం కోసం పాటు పడుతున్న ప్రభుత్వానికి తమవంతు తోడ్పాటుగా విరాళం అందిస్తున్నామని మహావిష్ణు పేర్కొన్నారు. మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకురావాలంటూ అభిలషించారు. కాగా ఈ భేటీలో వైసీపీ శాసనసభ్యుడు శిల్పా చక్రపాణి రెడ్డి కూడా పాల్గొన్నారు. విర్కో గ్రూప్ గతేడాది కూడా ఏపీ కొవిడ్ రిలీఫ్ ఫండ్ కు రూ.1 కోటి విరాళం అందించింది.
Andhra Organics Limeted
Virchows
Donation
CM Jagan
Covid
Floods
Andhra Pradesh

More Telugu News