ప్రజాసమస్యలు గాలికొదిలేసి సినీ పరిశ్రమ చుట్టూ తిరగడం సరికాదు: వైసీపీ సర్కారుపై పయ్యావుల కేశవ్ విమర్శలు
- రగులుతున్న సినిమా టికెట్ల ధరల అంశం
- సినిమాలతో ప్రభుత్వం ఆనందం పొందుతోందన్న కేశవ్
- మీరు ఏ సమస్యను పరిష్కరించారంటూ నిలదీత
ఇవాళ పీఏసీ సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం పయ్యావుల మాట్లాడుతూ, విద్యుత్ అంశాలపై సమాచారం ఇవ్వకుండా కొవిడ్ పేరుతో సమావేశానికి దూరం కావడంపై విమర్శలు చేశారు.
"ఏ సమస్యను మీరు పరిష్కరించారు? ఏ నిత్యావసర వస్తువుల ధరలను మీరు తగ్గించారు? డబ్బున్న వాళ్లో, సరదాపడిన వాళ్లో సినిమాకు పోవాలనుకుంటే దాంతో మీరు ఆనందం పొందాలనుకుంటున్నట్టుంది. తిట్టడానికే తప్ప మాట్లాడ్డానికి మంత్రులు కరవయ్యారు. ఈ రాష్ట్రంలో సినిమాలను మించిన అజెండా చాలా ఉంది. ప్రజల వినోదం కోసం ఉండాల్సిన సినిమా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ కు వినోదంగా మారింది" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.