కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్

10-01-2022 Mon 16:27
  • దేశంలో కరోనా స్వైరవిహారం
  • మరోసారి భారీ సంఖ్యలో కేసులు
  • స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రాజ్ నాథ్ సింగ్
  • హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని వెల్లడి
  • తనను కలిసినవాళ్లు టెస్టులు చేయించుకోవాలని సూచన
Union defense minister Rajnath Singh tested corona positive
దేశంలో కరోనా థర్డ్ వేవ్ సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. తాజాగా కేంద్ర రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని, కరోనా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ ఐసోలేషన్ లో ఉండాలని, తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు.