ఒమిక్రాన్ బారిన శోభన... ఖుష్బూకు సోకిన కరోనా

10-01-2022 Mon 15:35
  • తమిళనాడులో కరోనా ఉద్ధృతం
  • ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒమిక్రాన్ సోకిందన్న శోభన
  • లక్షణాలు క్రమంగా తగ్గుతున్నాయని వెల్లడి
  • గత రెండు వేవ్ లలో తప్పించుకున్న ఖుష్బూ
  • ఈసారి తప్పించుకోలేకపోయానంటూ వివరణ
Shobhana tested Omicron positive and Khushbu got infected with Corona
దేశంలో కరోనా ప్రభావం మళ్లీ ఊపందుకుంది. అటు ఒమిక్రాన్ కూడా విజృంభిస్తోంది. కాగా, సీనియర్ నటి శోభన (51) ఒమిక్రాన్ బారినపడింది. తాను కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నానని, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఒమిక్రాన్ సోకిందని శోభన వెల్లడించింది. తొలిరోజు చలిజ్వరం, గొంతునొప్పి, కీళ్ల నొప్పులతో బాధపడ్డానని, ఇప్పుడా లక్షణాలు క్రమంగా తగ్గుతున్నాయని తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించింది.

అటు, మరో సీనియర్ నటి, బీజేపీ నేత ఖుష్బూకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత రెండు వేవ్ లలో తాను కరోనా నుంచి తప్పించుకున్నానని, ఈసారి మాత్రం కరోనా సోకిందని ఖుష్బూ వెల్లడించింది. ప్రస్తుతం తాను ఐసోలేషన్ లో ఉన్నట్టు వివరించింది. తమిళనాడులో భారీగా కరోనా కేసులు నమోదవుతుండడం తెలిసిందే. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో 12 వేలకు పైగా కొత్త కేసులు వెల్లడయ్యాయి.