Ram Gopal Varma: సినీ పరిశ్రమ ప్రతినిధిగా వచ్చా: రామ్ గోపాల్ వర్మ

I came as YSRCP representative says Ram Gopal Varma
  • మంత్రి పేర్ని నానితో భేటీ అయిన రామ్ గోపాల్ వర్మ
  • భేటీకి ముందు మీడియాతో మాట్లాడిన వర్మ
  • తన అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకెళ్తానని వ్యాఖ్య
ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ భేటీ అయ్యారు. అమరావతిలోని సచివాలయంలో వీరి భేటీ కొనసాగింది. భేటీకి ముందు మీడియాతో రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ... సినీ పరిశ్రమ ప్రతినిధిగా తాను ఇక్కడకు వచ్చానని చెప్పారు. తన అభిప్రాయాలను మంత్రి దృష్టికి తీసుకెళతానని అన్నారు. ఇతరులు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని చెప్పారు. తాను ఏది చెప్పాలనుకున్నానో అది మాత్రమే మంత్రితో జరిగే భేటీలో ప్రస్తావిస్తానని తెలిపారు. టికెట్ ధరల అంశం ఎప్పటికి పరిష్కారం అవ్వొచ్చనే ప్రశ్నకు సమాధానంగా... ఆ విషయం తాను చెప్పలేనని, అది ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పారు. భేటీ తర్వాత అన్ని వివరాలను వెల్లడిస్తానని చెప్పారు.
Ram Gopal Varma
Tollywood
Perni Nani
YSRCP

More Telugu News