Artificial Heart: కృత్రిమ గుండెను తయారుచేస్తున్న ఐఐటీ కాన్పూర్

  • టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన ఐఐటీ కాన్పూర్
  • దేశ విదేశీ నిపుణులతో టాస్క్ ఫోర్స్
  • కృత్రిమ గుండెకు 'ఎల్వీఏడీ'గా నామకరణం 
IIT Kanpur set to make artificial heart

కృత్రిమ అవయవాలను రూపొందించే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా భారత పరిశోధకులు గుండెను ప్రయోగశాలలో తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు కృత్రిమంగా గుండెను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఐఐటీ కాన్పూర్ ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసి అవసరమైన ప్రక్రియ ప్రారంభించింది.

ఈ టాస్క్ ఫోర్స్ లో ఐఐటీ ప్రొఫెసర్లు, అమెరికా వైద్య నిపుణులు, ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, మేదాంత వైద్య సంస్థలకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారు. ఈ కృత్రిమ గుండెకు లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (ఎల్వీఏడీ)గా నామకరణం చేశారు. వైద్య రంగంలో ఐఐటీ కాన్పూర్ చేసిన విశేష కృషిని చర్చించేందుకు తాజాగా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే కృత్రిమ గుండె తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

More Telugu News