Brother Anil: షర్మిల పార్టీ గురించి మాట్లాడనన్న భర్త అనిల్!

Brother Anil response on YS Sharmila political party in Andhra Pradesh
  • తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న షర్మిల
  • ఏపీలో పార్టీ పెట్టబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం
  • పార్టీ ఏర్పాటు గురించి తాను మాట్లాడనని చెప్పిన బ్రదర్ అనిల్

తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీని స్థాపించిన వైయస్ షర్మిల పొలిటికల్ గా చాలా యాక్టివ్ గా ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె క్రమం తప్పకుండా విమర్శలు కురిపిస్తున్నారు. పాదయాత్రల ద్వారా, ధర్నాల ద్వారా ఆమె ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా ఆమె రాజకీయ పార్టీ పెట్టే యోచనలో ఉన్నారనే ప్రచారం ఎక్కువవుతోంది. రాజకీయ పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు ఈ ప్రచారానికి మరింత బలాన్ని తీసుకొచ్చాయి.

మరోవైపు ఈ వార్తలపై షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద మీడియా ఆయనను పలకరించి, ఏపీలో షర్మిల పార్టీపై ప్రశ్నించగా... షర్మిల పార్టీకి, తనకు సంబంధం లేదని చెప్పారు. పార్టీ ఏర్పాటు గురించి తాను మాట్లాడనని తెలిపారు. విజయవాడలో చిన్న ఫంక్షన్ వుంటే వచ్చానని చెప్పారు.

  • Loading...

More Telugu News