Sovereign Gold Bond: నేటి నుంచి బంగారం బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు..

Sovereign Gold Bond scheme ISSUE OPENED
  • సార్వభౌమ బంగారం బాండ్ల ఇష్యూ ఆరంభం
  • 14వ తేదీ వరకు అందుబాటులో
  • గ్రాము బంగారం ధర రూ.4,786
  • డిజిటల్ చెల్లింపులపై రూ.50 తగ్గింపు

బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి సార్వభౌమ బంగారం బాండ్ స్కీమ్ ఇష్యూ (2021-22లో 9వ విడత) సోమవారం (జనవరి 10) ప్రారంభమైంది. పెట్టుబడి కోణంలో బంగారం కొనుగోలు చేసుకోవాలనుకుంటే ఇది ఎంతో మెరుగైనది. ఈ నెల 14వ తేదీ వరకు ఇష్యూ తెరిచి ఉంటుంది.

ఒక గ్రాము బంగారం ధర రూ.4,786. ఒక గ్రాము నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. డిజిటల్ చెల్లింపులతో కొనుగోలు చేసే వారికి ఒక గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. ఒక్కొక్కరు గరిష్ఠంగా 4 కిలోల బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. బ్యాంకులు, స్టాక్ బ్రోకర్ల ద్వారా బంగారం బాండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.

అయితే, ఇప్పుడు కొని కొన్ని నెలల తర్వాత విక్రయిద్దామనుకునే వారికి ఇది అనుకూలం కాకపోవచ్చు. ఎందుకంటే సమీప కాలంలో బంగారం ధరల్లో కొంత దిద్దుబాటు రావచ్చని విశ్లేషకుల అంచనా. అయితే దీర్ఘకాలం కోసం కొని పెట్టుకోవాలని అనుకునే వారికి అనుకూలం.

ఇష్యూలో నిర్ణయించిన గ్రాము బంగారం విలువ ఆధారంగా ఏటా 2.5 శాతాన్ని వడ్డీ కింద ఇన్వెస్టర్ కు జమ చేస్తారు. బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. మెచ్యూరిటీ వరకు కొనసాగితే చివర్లో రాబడిపైనా పన్ను ఉండదు. ముందుగా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పన్ను పడుతుంది. 5, 6, 7వ ఏట బాండ్ నుంచి తప్పుకుకునేందుకు ఆబీఐ అవకాశం కల్పిస్తుంది. స్టాక్ మార్కెట్లోనూ విక్రయించుకోవచ్చు.

  • Loading...

More Telugu News