కిరాణా కొట్టు యజమాని కూతురు పాత్రలో రష్మిక!

10-01-2022 Mon 11:27
  • యూత్ లో రష్మికకి మంచి క్రేజ్ 
  • రీసెంట్ గా 'పుష్ప'తో దక్కిన హిట్ 
  • మహిళా ప్రధాన చిత్రంలో ఛాన్స్ 
  • దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్
Rashmika in Rahul Raveendran Movie
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రేసులో ఇప్పుడు రష్మిక ముందు వరుసలో కనిపిస్తోంది. వరుస సినిమాలతో .. వరుస హిట్లతో ఆమె దూసుకుపోతోంది. తెలుగుతో పాటు తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లోను తన జోరు చూపించే దిశగా ఆమె ప్రయాణం కొనసాగుతోంది. తెలుగులో రీసెంట్ గా ఆమె చేసిన 'పుష్ప' సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఇక శర్వానంద్ జోడీగా ఆమె చేస్తున్న 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సెట్స్ పై ఉంది. ఈ నేపథ్యంలో ఆమె నాయిక ప్రధానమైన ఒక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకి, రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరుగుతున్నాయి.

ఈ సినిమాలో రష్మిక ఒక గ్రామంలో కిరాణ కొట్టు నడిపే వ్యక్తికి కూతురుగా కనిపిస్తుందట. ఒక కిరాణా షాపు యజమాని కూతురు, బిజినెస్ విమెన్ గా ఏ స్థాయికి ఎదిగిందనేదే ఈ కథ. ఇంతవరకూ ఆడిపాడే పాత్రలను చేస్తూ వచ్చిన రష్మిక, ఈ పాత్ర తనకి మంచి పేరు తీసుకువస్తుందనే నమ్మకంతో ఉందట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.