YSRCP: కడప జిల్లా కమలాపురంలో ఈరోజు రైల్ రోకో నిర్వహించనున్న వైసీపీ ఎమ్మెల్యేలు

Kadapa District YSRCP MLAs to take up rail roko programme today
  • కమలాపురం, కొండాపురం, ముద్దనూరు, నందలూరు స్టేషన్లలో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని డిమాండ్
  • గతంలో ఈ స్టేషన్లో ఎక్స్ ప్రెస్ లు ఆగేవన్న వైసీపీ నేతలు
  • కరోనా వచ్చిన తర్వాత ఎక్స్ ప్రెస్ లను ఆపడం లేదన్న నాయకులు
కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు ఈరోజు రైల్ రోకో నిర్వహిస్తున్నారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కమలాపురం రైల్వేగేట్ వద్ద రైల్ రోకో నిర్వహించనున్నారు. కమలాపురం, కొండాపురం, ముద్దనూరు, నందలూరు స్టేషన్లలో ఎక్స్ ప్రెస్ రైళ్లను నిలపాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

 గతంలో ఈ స్టేషన్లలో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపేవారని... కరోనా వచ్చిన తర్వాత ఆపడం లేదని వైసీపీ నేతలు తెలిపారు. కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలని కోరుతున్నామని అన్నారు. ఇప్పటికే పలుసార్లు రైల్వే అధికారులకు లేఖలు రాసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని... అందుకే రైల్ రోకో కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి కూడా పాల్గొంటారు.
YSRCP
Kadapa District
MLAs
Rail Roko

More Telugu News