Ashok Galla: రాజమౌళి చేతుల మీదుగా ఈ సాయంత్రం 'హీరో' ట్రైలర్ లాంచ్!

  • 'హీరో'గా అశోక్ గల్లా
  • దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య
  • సంగీత దర్శకుడిగా గిబ్రాన్
  • ఈ నెల 15వ తేదీన విడుదల  
Hero movie update

కృష్ణ పెద్ద కూతురు పద్మావతి గల్లా కుమారుడు .. మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. 'హీరో' టైటిల్ తోనే ఈ కుర్రాడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. ఆయన సొంత బ్యానర్లోనే ఈ సినిమా నిర్మితమైంది. ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తిరుపతిలో నిన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక జరపాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అయితే రమేశ్ బాబు హఠాన్మరణం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ రోజున సాయంత్రం 4:05 నిమిషాలకు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేయిస్తున్నారు.

అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. సినిమా హీరో కావాలనే ఒక పట్టుదలతో, ఒక మధ్యతరగతి కుర్రాడు ఏం చేశాడు? అనేదే ఈ సినిమా కథ. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిచిన ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చాడు. నిధి అగర్వాల్ కథానాయికగా కనువిందు చేయనుంది..

More Telugu News