Harish Shankar: నెటిజెన్ పై ఘాటుగా స్పందించిన సినీ దర్శకుడు హరీశ్ శంకర్

Director Harish Shankar fires on a netizen
  • ఒమిక్రాన్ గురించి అంతగా ఆందోళన చెందొద్దన్న వైద్యుడి వీడియో షేర్ చేసిన హరీశ్ శంకర్
  • బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారన్న నెటిజెన్
  • మంచి చెప్పినా మీలాంటి వారు నిరాశ చెందుతూనే ఉంటారన్న హరీశ్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ డైరెక్టర్లలో హరీశ్ శంకర్ ఒకరు. పలు అంశాలపై ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఓ ప్రముఖ వైద్య నిపుణుడి వీడియోను ఆయన షేర్ చేశారు. ఒమిక్రాన్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీడియోలో సదరు వైద్యుడు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.

ఈ వీడియోను షేర్ చేసిన హరీశ్ శంకర్... వైరస్ వ్యాప్తి పట్ల సామాన్య ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే ఈ వీడియో పట్ల ఓ నెటిజెన్ సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. హరీశ్ శంకర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని... ఒమిక్రాన్ ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఈ వ్యాఖ్యలపై హరీశ్ ఘాటుగా స్పందించారు. ఒక వైద్య నిపుణుడు ప్రజల్లో ఆశలు పెంచే దిశగా మంచి గురించి చెప్పినా మీలాంటి స్టుపిడ్స్ నిరాశ చెందుతూనే ఉంటారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Harish Shankar
Tollywood
Social Media
Netizen

More Telugu News