Sonu Sood: ఇతర నటుల్లాగే నేనూ నడిచి వుంటే జీవితంలో చాలా వెలితి ఉండేది: సోనూసూద్

  • ఇవ్వడంలో ఎంతో ఆనందం ఉంది
  • అపరిచితులు ఎవరూ లేరు
  • ఎవరో ఒకరికి సాయపడొచ్చు
  • సేవా కార్యక్రమాలపై అభిప్రాయాలు వెల్లడి
Suddenly the world has no strangers

కరోనా విపత్తు వచ్చి రెండేళ్లు అయిందని, అయినా అత్యవసర భావన ఇంకా పెరిగిపోయిందని సినీ నటుడు సోనూసూద్ అన్నారు. పది మందికి సేవ చేయడం కర్మ సిద్ధాంతంలో భాగమేనని చెబుతూ.. ఇవ్వడం ద్వారా ఎంతో ఆనందాన్ని పొందుతున్నట్టు చెప్పారు. ఇతర నటుల్లాగే తాను కూడా నడిచి ఉంటే తన జీవితంలో ఎంత వెలితి ఉండేదోనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.

‘‘నేను నా స్టార్ డమ్ దాటి వెళ్లాలని, పది మందికి సాయపడాలని విధి నిర్ణయించినట్టు ఉంది. ఇవ్వడంలో ఎంతో ఆనందం ఉందని గుర్తించాను. ఇది వర్ణించలేని భావోద్వేగం. నేను తొలినాళ్లలో చేసిన దాతృత్వం చాలా చిన్నది. ఇంకా చాలా చేయాల్సింది. ప్రతి రోజూ సాయం కోరుతూ వందలాది కాల్స్ వస్తుంటాయి. వైద్యం, విద్య, మానవత.. ఇలా ఎన్నో రకాలుగా సాయం కోరుతూ వుంటారు. నేను ప్రతి ఒక్కరికి సాయం చేయగలనా? లేదు.

కానీ వీలైనంత ఎక్కువ మందికి సాయపడాలన్నదే నా ప్రయత్నం. తెరవెనుక నుంచి సాయపడుతున్న ఎంతో మందిని తరచూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. తెలియని వ్యక్తికి సాయం చేయాలంటూ మరో తెలియని వ్యక్తిని కోరడానికి నేను వెనుకాడను. నా సాయం కోరే వ్యక్తిని నేను గతంలో ఎప్పుడు కూడా కలిసింది లేదు. ఆ వ్యక్తికి సాయం కోరుతూ నేను వ్యక్తిగతంగా సంప్రదించే వైద్యులు, కాలేజీ ప్రిన్సిపల్, రాయబారులు లేదా వ్యక్తులు కూడా తెలియనివారే.

ఉన్నట్టుండి ప్రపంచంలో అపరిచితులు (తెలియని వారు) మాయమయ్యారు. మనమంతా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరికి సాయపడడం ద్వారా జీవితాన్ని సులభమయం చేయవచ్చు’’ అని సోనూసూద్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.

More Telugu News