బండ్ల గణేశ్ కు మరోసారి కరోనా పాజిటివ్

09-01-2022 Sun 22:04
  • మూడోసారి కరోనా బారినపడిన బండ్ల గణేశ్
  • ఢిల్లీలో మూడ్రోజులు ఉన్నానని వెల్లడి
  • కరోనా పరీక్షలు చేయించుకున్నట్టు వివరణ
  • ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నానంటూ ట్వీట్
Bandla Ganesh tested corona positive again
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కు కరోనా మరోసారి సోకింది. గతంలో ఆయన రెండు సార్లు కరోనా బారినపడ్డారు. రెండోసారి కరోనా సోకడంతో బండ్ల గణేశ్ కు ఆసుపత్రిలో బెడ్ దొరకడం చాలా కష్టమైంది. మెగాస్టార్ చిరంజీవి మాట చలవతో అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది కోలుకున్నారు.

అయితే, గత మూడ్రోజులుగా ఢిల్లీలో ఉన్నానని, ఈ సాయంత్రం కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చిందని బండ్ల గణేశ్ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లరాదని సూచించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో స్పందించారు.