'శేఖర్' చిత్రంలోని 'లవ్ గంటే..' పాటకు విశేష స్పందన

09-01-2022 Sun 21:36
  • రాజశేఖర్ హీరోగా 'శేఖర్'
  • జీవిత దర్శకత్వంలో చిత్రం
  • త్వరలోనే రిలీజ్
  • మిలియన్ వ్యూస్ కు చేరువలో 'లవ్ గంటే..' సాంగ్
Huge response to Love Gante song in Shekar movie
సీనియర్ నటుడు రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవిత దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'శేఖర్'. ఈ చిత్రం నుంచి కొన్నిరోజుల కిందట 'లవ్ గంటే మోగిందంట' అనే సాంగ్ రిలీజైంది. విడుదలయిన కొన్ని రోజుల్లోనే ఇది మిలియన్ వ్యూస్ ను సమీపించింది. అనూప్ రూబెన్స్ బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. 'శేఖర్' సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు.

ఇందులో ఆత్మీయ రంజన్, ముస్కాన్, అభినవ్ గోమటం, కన్నడ కిశోర్, సమీర్, భరణి, రవివర్మ, శ్రావణ్ రాఘవేంద్ర నటించారు. పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపుర క్రియేషన్స్ బ్యానర్లపై తెరకెక్కిన 'శేఖర్' చిత్రానికి బీరం సుధాకర్ రెడ్డి, బొగ్గారం వెంకట శ్రీనివాస్ లతో పాటు రాజశేఖర్ కుమార్తెలు శివాత్మిక, శివానీలు కూడా నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.