Dog Birthday: కుక్కకు అంగరంగవైభవంగా పుట్టినరోజు వేడుకలు.... ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

Police arrests three people for breaching corona norms in Dog Birthday bash
  • గుజరాత్ లో ఇటీవల కుక్కకు బర్త్ డే జరిపిన వ్యక్తి
  • రూ.7 లక్షలతో వేడుకలు
  • కరోనా నిబంధనలు పాటించలేదన్న పోలీసులు
  • ముగ్గురిపై కేసు నమోదు

ఇటీవల గుజరాత్ లో ఓ కుక్కకు రూ.7 లక్షల ఖర్చుతో అత్యంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు చేయడం తెలిసిందే. అహ్మదాబాద్ లోని కిరణ్ పార్క్ సొసైటీలో ఉండే చిరాగ్ పటేల్ అబ్బే అనే కుక్కను పెంచుకుంటున్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మారిపోయిన ఆ శునకం బర్త్ డే అంగరంగవైభవంగా జరిపారు. రంగురంగుల విద్యుద్దీపాలు, డీజే, ఫ్లెక్సీలు... ఇలా అన్ని హంగులతో సంబరం చేశారు. లక్షలు ఖర్చయినా వెనుకంజ వేయలేదు.

అయితే, ఇది కరోనా కాలం. కుక్క పుట్టినరోజు వేడుక సందర్భంగా కరోనా మార్గదర్శకాలు పాటించలేదంటూ చిరాగ్ పటేల్ తో పాటు ఆయన సోదరుడు ఉర్వీష్ పటేల్, దివ్యేశ్ మెహరియా అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, కుక్క పుట్టినరోజు వేడుకల వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News