Kuppam Mines: కుప్పం గనుల అక్రమ తవ్వకాలపై విచారణ జరుపుతాం: మంత్రి బొత్స

Minister Botsa says they will examine Kuppam mining
  • కుప్పంలో ఇటీవల చంద్రబాబు పర్యటన
  • గనులు పరిశీలించిన టీడీపీ అధినేత
  • వైసీపీ నేతలు దోచుకుంటున్నారని వ్యాఖ్యలు
  • చంద్రబాబు ఎన్నింటిపై విచారణ జరిపించాడన్న బొత్స
చిత్తూరు జిల్లా కుప్పం గనుల్లో అక్రమ తవ్వకాలు అంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తుండడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. కుప్పంలో గనుల అక్రమ తవ్వకాలపై విచారణ జరుపుతామని తెలిపారు. అయితే న్యాయ విచారణా? లేక, అధికారుల విచారణా? అనేది నిర్ణయించాల్సి ఉందని వెల్లడించారు. చంద్రబాబు హయాంలో ఎన్నింటిపై న్యాయవిచారణ జరిపించారని బొత్స ప్రశ్నించారు.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన సందర్భంగా పలు గనులను పరిశీలించారు. ప్రకృతి వనరులను ఎక్కడ కొల్లగొడితే అక్కడ మకాం వేసి పోరాటం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. సహజ వనరులు దోచుకుంటూ వైసీపీ నేతలు మాఫియాగా మారారని విమర్శించారు. గనుల దోపిడీకి పాల్పడుతున్న మంత్రి పెద్దిరెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు.
Kuppam Mines
Botsa
Chandrababu
TDP

More Telugu News