ఫ్యూచర్ కూపన్స్ తో ఒప్పందం రద్దుపై ట్రైబ్యునల్ ను ఆశ్రయించిన అమెజాన్
- గతంలో ఫ్యూచర్ కూపన్స్ తో అమెజాన్ ఒప్పందం
- నిబంధనలు పాటించలేదంటూ అమెజాన్ పై సీసీఐ అసంతృప్తి
- ఒప్పందం రద్దుతో పాటు రూ.202 కోట్ల జరిమానా
- సీసీఐ నిర్ణయాన్ని సవాల్ చేయాలని అమెజాన్ నిర్ణయం
ఫ్యూచర్ గ్రూప్ లో 49 శాతం వాటాలు చేజిక్కించుకునేలా 2019లో ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్ తో అమెజాన్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ లావాదేవీకి అనుమతులు కోరే క్రమంలో కీలక సమాచారాన్ని అమెజాన్ దాచిందంటూ సీసీఐ ఆ ఒప్పందాన్ని నిలుపుదల చేసింది. ఈ సందర్భంగా ఆమెజాన్ పై రూ.202 కోట్ల జరిమానా వడ్డించింది. గత నెలలో జారీ అయిన ఈ ఆదేశాలను అమెజాన్ ఇప్పుడు ఎన్సీఎల్ఏటీలో సవాల్ చేస్తోంది.