CM KCR: చినజీయర్ స్వామిని కలిసిన సీఎం కేసీఆర్... యాదాద్రి ఆలయ పునఃప్రారంభంపై చర్చ

  • త్వరలో యాదాద్రి ఆలయ పునఃప్రారంభం
  • చినజీయర్ స్వామితో సమావేశమైన సీఎం కేసీఆర్
  • మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శనయాగంపై చర్చ
CM KCR met Chinna Jeeyar Swamy

తెలంగాణ సీఎం కేసీఆర్ ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. సీఎం వెంట మంత్రులు హరీశ్ రావు,  ప్రశాంత్ రెడ్డి, మై హోం అధినేత రామేశ్వరరావు తదితరులు ఉన్నారు. కాగా, సీఎం కేసీఆర్ కు ఆశ్రమ రుత్విక్కులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్, చినజీయర్ స్వామి సమావేశమయ్యారు.

యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు. మహా సుదర్శన యాగం, మహా కుంభ సంప్రోక్షణ (మార్చి 28), తదితర క్రతువులు, ఆహ్వానాలు, ఏర్పాట్లపై సీఎం కేసీఆర్... చినజీయర్ స్వామి సలహాలు, అభిప్రాయాలు తీసుకున్నారు. ఆశ్రమ సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్ ఇక్కడి యాగశాలను కూడా పరిశీలించారు. యాగశాల ఏర్పాట్లపై సీఎం కేసీఆర్ కు చినజీయర్ స్వామి వివరాలు తెలిపారు.

More Telugu News