Rajendra Prasad: కరోనాతో ఏఐజీ ఆసుపత్రిలో చేరిన సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్

Actor Rajendra Prasad hospitalized with corona positive
  • టాలీవుడ్ లో కరోనా వ్యాప్తి
  • తాజాగా రాజేంద్రప్రసాద్ కు కొవిడ్ పాజిటివ్
  • స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రాజేంద్రప్రసాద్
  • ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
టాలీవుడ్ లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కూడా మహమ్మారి బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని వెల్లడైంది. దాంతో ఆయన హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు.

రాజేంద్రప్రసాద్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. టాలీవుడ్ లో ఇటీవల మహేశ్ బాబు, తమన్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులు కరోనా బారినపడడం తెలిసిందే.
Rajendra Prasad
Corona Virus
Positive
AIG Hospital
Hyderabad
Tollywood

More Telugu News