చినజీయర్ స్వామిని కలిసేందుకు ముచ్చింతల్ వెళుతున్న సీఎం కేసీఆర్

09-01-2022 Sun 14:47
  • ఈ సాయంత్రం చినజీయర్ స్వామితో కేసీఆర్ సమావేశం
  • మహా కుంభ సంప్రోక్షణపై చర్చ
  • యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపై చర్చ
CM KCR will meet Chinna Jeeyar Swamy
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ సాయంత్రం ముచ్చింతల్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లనున్నారు. చినజీయర్ స్వామితో భేటీ కానున్నారు. ఆయనతో పలు అంశాలపై మాట్లాడనున్నారు. మహా కుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం, రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చినజీయర్ స్వామితో చర్చించనున్నారు. అటు, యాదాద్రి ఆలయ పునఃప్రారంభ ఏర్పాట్లపైనా ఆయనతో చర్చించనున్నారు.