COVID19: పార్లమెంట్ లో కరోనా కలకలం.. 400 మంది సిబ్బందికి పాజిటివ్

400 Parliament Staff Tested Positive For Covid
  • 200 మంది లోక్ సభ, 69 మంది రాజ్యసభ సిబ్బందికి కరోనా
  • వేరియంట్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం శాంపిళ్లు
  • మరికొన్ని రోజుల్లోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. 400 మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పార్లమెంట్ లో మొత్తం 1,409 మంది పనిచేస్తుండగా.. జనవరి 4 నుంచి 8 మధ్య చేసిన టెస్టుల్లో ఈ కేసులు వెలుగు చూసినట్టు అధికారులు చెప్పారు. మరికొన్ని రోజుల్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఒకేసారి ఇంతమంది కరోనా బారిన పడడంపై ఆందోళన నెలకొంది. పాజిటివ్ వచ్చిన సిబ్బందిలో వేరియంట్ ఏదో తెలుసుకోవడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపినట్టు అధికారులు తెలిపారు.

కాగా, పాజిటివ్ వచ్చిన వారిలో 200 మంది లోక్ సభ సిబ్బంది కాగా.. 69 మంది రాజ్యసభ సిబ్బంది, 133 మంది అనుబంధ సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. వారితో కాంటాక్ట్ అయిన ఉన్నతాధికారులూ ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నట్టు చెబుతున్నారు.
COVID19
Parliament

More Telugu News