Mahesh Babu: మరో జన్మంటూ ఉంటే నువ్వే నాకు అన్నయ్య... సోదరుడి మరణంపై మహేశ్ బాబు శోకతప్త స్పందన

Mahesh Babu responds on his brother Ramesh Babu demise
  • తీవ్ర అనారోగ్యంతో రమేశ్ బాబు మృతి
  • అన్నయ్య మరణంతో విషాదంలో మహేశ్ బాబు
  • ప్రస్తుతం కరోనాతో ఐసోలేషన్ లో ఉన్న మహేశ్ 
  • సోషల్ మీడియాలో భావోద్వేగభరిత పోస్టు
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సోదరుడు రమేశ్ బాబు మరణంతో తీవ్ర విషాదానికి లోనయ్యారు. కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్న మహేశ్ బాబు... అన్నయ్యను కడసారి చూపులకు నోచుకోలేక తీరని వేదనతో కుమిలిపోతున్నారు. ఈ క్రమంలో మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఓ సందేశం పంచుకున్నారు.

"నువ్వే నాకు స్ఫూర్తి. నువ్వే నాకు అండ. నిన్ను చూసుకునే నేను ధైర్యంగా ఉన్నాను. నువ్వే నా సర్వస్వం. నువ్వు నా జీవితంలో లేకపోతే ఇవాళ నేనున్న స్థాయిలో సగం కూడా ఉండేవాడ్ని కాదేమో! నా కోసం నువ్వు చేసిన ప్రతి పనికి కృతజ్ఞతలు. ఈ జన్మలోనే కాదు, మరో జన్మంటూ ఉంటే నువ్వే నాకు అన్నయ్య. ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను... ఎప్పటికీ! విశ్రాంతి తీసుకో అన్నయ్యా... విశ్రాంతి తీసుకో!" అంటూ మహేశ్ బాబు తీవ్ర భావోద్వేగాలతో ట్వీట్ చేశారు.
Mahesh Babu
Ramesh Babu
Demise
Tollywood

More Telugu News