COVID19: నా పేరు KOVID.. నేను వైరస్ ను కాదు.. వైరల్ అవుతున్న ఇండియన్ పేరు

  • కొవిడ్ కాదు.. కోవిద్ అంటూ వివరణ
  • హనుమాన్ చాలీసా నుంచి పెట్టారని వెల్లడి
  • ఒమారియన్ అనే సింగర్ పేరూ వైరల్
  • తాను వేరియంట్ ను కాదంటూ వివరణ
KOVID and OMARION Names Go Viral

ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఇలాంటి సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు పెట్టిన పోస్టులు వైరల్ గా మారాయి. కోవిద్ (KOVID) కపూర్, ఒమారియన్ అనే ఇద్దరు వ్యక్తులు తమ గురించి తాము చెప్పుకొచ్చారు.

భారత్ కు చెందిన కోవిద్ కపూర్ అనే వ్యక్తి Holidify.com అనే ట్రావెల్ స్టార్టప్ యజమాని. అతడు తన ట్విట్టర్ బయోలో ‘నా పేరు కోవిద్.. నేను వైరస్ ను కాదు’ అని రాసుకున్నాడు. ట్విట్టర్ లో చాలాసార్లు చాలా మందికి తన పేరు గురించి వివరణ ఇచ్చాడు. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలోనూ ఓ పోస్ట్ ఫెట్టాడు. కొవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడే తొలిసారి విదేశాలకు వెళ్లానని, చాలా మంది తన పేరును చూసి ఆశ్చర్యపోయారని ట్వీట్ చేశాడు. భవిష్యత్ విదేశీ పర్యటనలు మరింత ఫన్నీగా ఉంటాయంటూ పేర్కొన్నాడు.

ఇక, తన పేరు ‘కొవిడ్’ కాదని, ‘కోవిద్’ అని వివరణ ఇచ్చాడు. కోవిద్ అంటే ‘పండితుడు’ అని అర్థమని, హనుమాన్ చాలీసా నుంచి ఈ పేరును పెట్టారని చెప్పాడు. ఆయన పేరుపై విపరీతమైన మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. తానూ భారతీయుడేనని, ఇలాంటి పేరును ఇప్పటిదాకా వినలేదని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. పేరును ‘ట్రేడ్ మార్క్’గా రిజిస్టర్ చేసుకుంటే సరి అని మరో యూజర్ రాసుకొచ్చాడు.

మరో విషయంలో ఓ అమెరికన్ పాప్ సింగర్ పేరూ ఇలాగే వార్తల్లోకెక్కింది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ ఎంతగా వ్యాప్తి చెందుతోందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒమారియన్ అనే సింగర్ తన ట్విట్టర్ అకౌంట్ లో తన పేరుపై క్లారిటీ ఇచ్చాడు. సరదా వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా పేరు ఒమారియన్. నేను ఆర్టిస్ట్ ను.. వేరియంట్ ను కాదు’’ అని చెప్పాడు. వీధుల్లో తాను ఎదురైతే ఎవరూ ఐసోలేట్ కావాల్సిన అవసరం లేదని, నా పాటలకు డ్యాన్స్ వేయడానికి నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ కూడా అక్కర్లేదని పేర్కొన్నాడు. జాగ్రత్తగా ఉండండి.. ఆరోగ్యంగా ఉండండి అంటూ ప్రజలకు సూచించాడు.

  • Loading...

More Telugu News