Sharmila: ఢిల్లీని ఏలడానికి మీటింగులకు సమయం ఉంటుంది కానీ, ఈ విషయానికి మాత్రం ఉండ‌దా?: ష‌ర్మిల‌

sharmila slams kcr
  • రాష్ట్రంలో రైతు చావులను పట్టించుకోవడానికి సమయం లేదు
  • ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా?
  • కేసీఆర్ ఇక్కడి రైతులనే ఆదుకోవ‌ట్లేదు
  • రైతుల పాలిట రాక్షస పాలన చేస్తున్నారు
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల తీవ్ర విమ‌ర్శలు గుప్పించారు. రైతుల క‌ష్టాల గురించి కేసీఆర్ ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆమె అన్నారు. 'ఢిల్లీని ఏలడానికి మీటింగులు పెట్టుకోవడానికి సమయం ఉంటుంది కానీ, రాష్ట్రంలో రైతు చావులను పట్టించుకోవడానికి సమయం లేదు దొర గారికి. ఇంట గెలవనోడు రచ్చ గెలుస్తాడా? మీరు ఇక్కడి రైతులనే ఆదుకోనప్పుడు, రైతుల పాలిట రాక్షస పాలన చేస్తున్న ఈ  రైతు ద్రోహి ప్రభుత్వానికి దేశం పట్టం కడుతుందా?' అని వైఎస్ ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

'రైతుబంధు ఇచ్చి రైతులకు ఉపాధి చూపుతున్నాం అన్న దొరగారి గప్పాలు నిజమైతే మొన్న ఇద్దరు, నిన్న నలుగురు, ఇవాళ ఒక్కరు.. పెట్టిన పెట్టుబడి రాక, అప్పుల బాధతో పంట నష్టపోయి ఆత్మహత్యలు ఎందుకు చేసుకొంటారు? రైతు ఆత్మహత్యలను ఆపడం చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు' అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.
Sharmila
YSRTP
Telangana

More Telugu News