ipl 2022: ఆటగాళ్ల వేలం తర్వాత ఐపీఎల్ వేదికను తేల్చనున్న బీసీసీఐ

  • విదేశీ వేదికల పరిశీలన
  • అయినా భారత్ లో నిర్వహణకే ప్రాధాన్యం
  • రాష్ట్రాల మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు
  • ఫిబ్రవరిలో ఆటగాళ్ల వేలం
BCCI hoping to hold tournament in India but hosting overseas among options being considered

ఐపీఎల్ కు మూడు నెలల వ్యవధే మిగిలి ఉంది. ఏటా ఏప్రిల్ లో ఐపీఎల్ సీజన్ నడుస్తుంటుంది. కరోనా వల్ల గత రెండు సంవత్సరాల పాటు ఆట షెడ్యూల్, వేదిక మారిపోయాయి. గడిచిన రెండు సీజన్ లను యూఏఈలో నిర్వహించాల్సి వచ్చింది. కానీ, తదుపరి సీజన్ ను భారత్ లోనే నిర్వహించాలన్న పట్టుదలతో బీసీసీఐ ఉంది. అయితే కరోనా కేసులు ఒమిక్రాన్ రూపంలో గణనీయంగా పెరిగిపోతుండడం అనిశ్చితికి దారితీస్తోంది.

ప్రస్తుతానికి ఆటగాళ్ల వేలంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దృష్టి పెట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఐపీఎల్ 2022 వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. ఆటగాళ్ల మెగా వేలం ముగిసిన తర్వాత ఐపీఎల్ ఎక్కడ నిర్ణయించేది బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందని తెలిపాయి. విదేశీ వేదికలను కూడా పరిశీలిస్తుందని, అయినా భారత్ లో నిర్వహించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు పేర్కొన్నాయి.

అధికారికంగా తేదీలు, షెడ్యూల్ ఖరారు కాలేదు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆటగాళ్ల వేలాన్ని పూర్తి చేసి, ఏప్రిల్ నుంచి ఐపీఎల్ నిర్వహించాలన్నది యోచనగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా ఐపీఎల్ పై నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఏడాది రెండు కొత్త జట్లు అహ్మదాబాద్, లక్నో ఐపీఎల్ లో చేరనున్నాయి. ఇందుకోసమే మెగా వేలం నిర్వహించనున్నారు.

More Telugu News