krishna: రమేశ్ బాబు భౌతిక కాయానికి ప్ర‌ముఖుల నివాళులు

  • హైదరాబాద్‌లోని పద్మాలయ స్టూడియోలో భౌతికకాయం
  • పద్మాలయ స్టూడియోకు చేరుకున్న ప్ర‌ముఖులు
  • కృష్ణ‌, ముర‌ళీ మోహ‌న్, గ‌ల్లా జ‌య‌దేవ్ నివాళులు
  • కాసేప‌ట్లో ర‌మేశ్ బాబు అంత్య‌క్రియ‌లు
ramesh babu last rituals

సూపర్‌ స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేశ్ బాబు సోదరుడు రమేశ్‌బాబు (56) నిన్న‌ అనారోగ్యంతో కన్నుమూసిన విష‌యం తెలిసిందే. హైదరాబాద్‌లోని పద్మాలయ స్టూడియోలో రమేశ్‌ బాబు భౌతికకాయన్ని సంద‌ర్శ‌నార్థం ఉంచారు. పద్మాలయ స్టూడియోకు చేరుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, ప‌లువురు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు రమేశ్ బాబు భౌతిక కాయానికి నివాళులర్పించారు.

రమేశ్ బాబు భౌతిక కాయానికి సూప‌ర్ స్టార్ కృష్ణ‌, ముర‌ళీ మోహ‌న్, గ‌ల్లా జ‌య‌దేవ్ నివాళులు అర్పించారు. మ‌హేశ్ బాబుకు క‌రోనా సోక‌డంతో ఆయ‌న క్వారంటైన్ లో ఉంటోన్న విష‌యం తెలిసిందే. కాసేప‌ట్లో ర‌మేశ్ బాబు అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌నున్నారు.

More Telugu News